ఉప్పు భూముల పరిశీలన, ధరలపై కలెక్టర్ సమీక్ష

ఉప్పు భూముల పరిశీలన, ధరలపై కలెక్టర్ సమీక్ష

బాపట్ల: జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మంగళవారం ఉప్పు భూముల పరిశీలన, వాటి ధరల నిర్ధారణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఉప్పు భూముల స్థితిగతులు, వాటికి సంబంధించిన ధరల విధానంపై కలెక్టర్ చర్చించారు. భూముల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, ధరల నిర్ధారణలో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు.