రేపు జిల్లాలో జాబ్ మేళా

రేపు జిల్లాలో జాబ్ మేళా

BDK: టేకులపల్లిలో మోడల్ కెరీర్ సెంటర్‌లో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి శ్రీరాం తెలిపారు. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి, 20 నుంచి 40 ఏళ్ల వయసు గల అభ్యర్థులు ఇంటర్వూలకు హాజరవచ్చని ఆయన పేర్కొన్నారు. మారుతి ఆగ్రో అండ్ ఫర్టిలైజర్స్ కంపెనీ ఉద్యోగాలకు ఎంపిక జరుగనుందని సూచించారు. మరిన్ని వివరాలకు 9666710273 నంబరును సంప్రదించాలన్నారు.