తాత్కాలిక రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభం

తాత్కాలిక రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభం

SRD: నాగలిగిద్ద మండలం ఔదత్పూర్ గ్రామం నుంచి గౌడ్గాం జన్వాడ వరకు ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు రోడ్డు బాగా దెబ్బతింది. ఈ మేరకు గుంతలు ఏర్పడ్డాయి. ప్రయాణానికి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి రూ.5 లక్షలు మంజూరు చేసి మరమ్మతులకు మంగళవారం పనులను ప్రారంభించారు. దాంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.