శ్రీ రాఘవేంద్ర మఠానికి రూ. లక్ష విరాళం
కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి కర్ణాటక తుంకూరు చెందిన భక్తురాలు జయలక్ష్మి ప్రహ్లాదరావు మంగళవారం రూ.1 లక్ష విరాళం అందించారు. ఈ విరాళాన్ని అన్నదానికి వినియోగించాలని ఆమె సూచించారు. దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనం కల్పించగా, పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామిజీ ఫలమంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.