ఎమ్మెల్యే గ్రీవెన్స్‌లో 48 ఫిర్యాదులు

ఎమ్మెల్యే గ్రీవెన్స్‌లో 48 ఫిర్యాదులు

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధబి బుధవారం భోగాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామాల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన, భూ సమస్యలకు సంబంధించిన అంశాలపై నియోజకవర్గ ప్రజల నుంచి 48 వినతులు అందుకున్నారు. అనంతరం వినతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.