ఉపాధి హామీ, కార్మిక చట్టాలపై సీపీఎం వినతి
ASR: హుకుంపేటలో సీపీఎం ఆధ్వర్యంలో ఎంఆర్‌వోకు వినతిపత్రం సమర్పించారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేసి పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల, ఉపాధి కొరతతో పేదలు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 12న సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు.