బాసర ఆర్జీయూకేటిని సందర్శించిన కలెక్టర్

బాసర ఆర్జీయూకేటిని సందర్శించిన కలెక్టర్

బాసర ఆర్జీయూకేటిని కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ఈ సందర్భంగా వీసీ ఛాంబర్‌లో వర్సిటీ అధికారులు, బోధన సిబ్బందితో సమావేశమై విద్యార్థులకు అందిస్తున్న బోధన, వసతులపై సమీక్ష నిర్వహించారు. ప్రవేశాల ప్రక్రియ, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.