యువతకు వెంకయ్యనాయుడు కీలక పిలుపు
AP: కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. యువత దేశం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీని కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహానీయులను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. యువత మాతృభాష, భారతీయ సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వారి శక్తి, సామర్థ్యాలను దేశాభివృద్దికి వినియోగించాలని తెలిపారు.