కొత్త కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం

కొత్త కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం

ATP: జిల్లా ఎస్పీ పీ. జగదీష్ ఐపీఎస్‌ వినూత్నంగా "మీ మొబైల్ – మీ ఇంటికి" కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లపై CHATBOT/CEIR ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, వాటిని గుర్తించి, నేరుగా యజమానుల ఇంటి వద్దకే పోలీసులు అందజేయనున్నారు. ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు రాకుండా వారి వద్దకే సేవలను అందించడం దీని లక్ష్యమని ఎస్పీ తెలిపారు.