అగ్ని ప్రమాదం.. పశువుల కొట్టం దగ్ధం
సత్యసాయి: ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ సిరిగారి పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో బుధవారం సాయంకాలం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న నరసింహులు జీవనాధారంగా నిర్మించుకున్న పశువుల కొట్టం విద్యుత్ వైర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు ₹50,000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.