మురుగునీరు నిల్వతో తీవ్ర దుర్గంధం

మురుగునీరు నిల్వతో తీవ్ర దుర్గంధం

VZM: సంతకవిటి మండలం బొద్దురు హైస్కూల్ వెనుక ఉన్న దళితవాడ సమీపంలో మురుగునీరు నిల్వతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు, విష సర్పాలు ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానికులు బుధవారం తెలిపారు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.