పర్యాటకులతో కిక్కిరిసిన బొర్రా, డముకు

పర్యాటకులతో కిక్కిరిసిన బొర్రా, డముకు

ASR: అనంతగిరి మండలంలోని బొర్రాగుహలు, డముకు వ్యూ పాయింట్, కాఫీ తోటలు, జలపాతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. కార్తిక మాసం, మంచు కురుస్తుండటంతో బెంగాలీ పర్యాటకుల రద్దీ ఎక్కువైంది. నిన్న ఒక్కరోజే 3,400 మంది బొర్రాగుహలను సందర్శించుకోగా, రూ.2.73 లక్షల ఆదాయం వచ్చినట్లు మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు. ముందు ముందు ఇంకా సందర్శకుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.