పక్షులకు ఆవాసా కేంద్రంగా కవ్వాల్ అభయారణ్యం
MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యం పక్షులకు ఆవాస కేంద్రంగా మారిందని జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ తెలిపారు. సోమవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు అభయారణ్యం మణిహారంగా ఉందని, వివిధ ప్రాంతాల నుంచి పక్షులు భారీగా తరలివస్తున్నాయన్నారు. వీటిలో స్వదేశీ పక్షులతో పాటు అరుదైన పక్షులు ఉన్నాయన్నారు. ఆ పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.