10 దుప్పులను కొరికి చంపిన కుక్కలు

10 దుప్పులను కొరికి చంపిన కుక్కలు

కేరళ త్రిసూర్ పూతూర్ జూ పార్కులో దారుణం జరిగింది. భద్రతా లోపం కారణంగా పార్కులోకి ప్రవేశించిన కుక్కలు.. 10 దుప్పులను వేటాడి చంపేశాయి. జూ పార్క్ ప్రారంభమై నెల రోజులైనా పూర్తి కాక ముందే ఇలాంటి ఘటన జరగటం విమర్శలకు దారి తీసింది. దీంతో అటవీ అధికారులు పార్కులో తనిఖీలు నిర్వహించారు. అనంతరం కళేబరాలను పోస్టుమార్టం కోసం తరలించారు.