అక్రమ నిర్మాణాలపై ఎంపీడీవోకు వినతి
ASR: జి.మాడుగుల మండలం కేంద్రంలోలో గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరుతూ 17 పంచాయతీల పేసా గ్రామసభల ప్రతినిధులు బుధవారం ఎంపీడీవో డేవిడ్ రాజుకు వినతిపత్రం అందజేశారు. పేసా, పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.