VIDEO: మొక్కజొన్న అమ్మకాల్లో రైతులు బిజీ
PPM: తుఫాన్ కారణంగా మొక్కజొన్న పంటను రోడ్డుపై టార్ఫాలిన్ కప్పి ఉంచిన రైతులు నిన్నటి నుంచి ఎండ కాయడంతో మొక్కజొన్న అమ్మకాల్లో బిజీగా ఉన్నారు. పాచిపెంట మండలంలో పలు గ్రామాల రైతులు మొక్కజొన్న పంటను అమ్ముతున్నారు. మండలంలో సుమారు 3,800 ఎకరాల్లో సాగు చేస్తుండగా ఈ ఏడాది అధిక వర్షాల వలన పెట్టుబడి కూడా రాలేదని రైతులు వాపోతున్నారు.