'వీర చంద్రహాస' టీజర్ చూశారా!
కేజీయఫ్, సలార్ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వీర చంద్రహాస'. ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ సినిమా త్వరలో తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలుగు టీజర్‌ను విడుదల చేసింది. యక్షగానం ఇతివృత్తంగా రూపొందిన ఈ మూవీలో శిథిల్ శెట్టి, నాగశ్రీ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ అతిథి పాత్ర పోషించారు.