పెట్రోల్ బంక్‌లో చోరీ.. ఆపై పరార్..!

పెట్రోల్ బంక్‌లో చోరీ.. ఆపై పరార్..!

ప్రకాశం: మద్దిపాడులోని ఓ పెట్రోల్ బంక్‌లో గురువారం తెల్లవారు జామున కారులో వచ్చిన వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. కారులో డీజిల్ పోయాలని బంక్‌లో పనిచేసే వ్యక్తి వద్ద నుంచి రూ.5 వేలు అపహరించి పరారయ్యాడు. పరారవుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత నిందితుడు గుంటూరు వైపు పారిపోయాడు.