నూతనకల్ వాసికి అంతర్జాతీయ గుర్తింపు..

SRPT: నూతనకల్ మండల కేంద్రానికి చెందిన మర్రి ప్రసన్న కుమార్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. కెనడాలోని విన్నిపెగ్ నగరంలో ఆగస్టు 16 నుంచి 26,2025 వరకు జరుగనున్న ప్రపంచ యువత స్థాయి ఆర్చరీ ఛాంపియన్షిప్‌లో భారత యువ ఆర్చరీ జట్టు కోచ్‌గా ఎంపిక చేశారు. ప్రసన్న కుమార్ ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్రం జంషెద్పూర్‌లో ఉన్న టాటా ఆర్చరీ అకాడమీలో కోచ్‌గా పనిచేస్తున్నారు.