నేడు హైదరాబాద్‌కు కొత్త గవర్నర్ రాక

నేడు హైదరాబాద్‌కు కొత్త గవర్నర్ రాక

TG: హైదరాబాద్‌కు ఇవాళ కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రానున్నారు. ఉ.11 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానుండటంతో సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆయన తెలంగాణకు బదిలీ అయ్యారు. ఇదివరకు గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా వెళ్లగా, శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు స్వీకరించనున్నారు.