నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా దర్బార్

నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా దర్బార్

NTR: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం గంపలగూడెం మండలంలో మండల స్థాయి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రజల నుండి వినతీలు స్వీకరిస్తారు. గంపలగూడెం ప్రజలందరూ ఈ అవకాశాన్న సద్వినియోగం చేసుకోవాలని కోరారు.