'సంపద సృష్టితో.. గ్రామాలలో స్వచ్ఛత'

'సంపద సృష్టితో.. గ్రామాలలో స్వచ్ఛత'

ELR: ముసునూరు మండలం సూరేపల్లి గ్రామంలో ఎంపీడీవో బసవరాజు అచ్యుత సత్యనారాయణ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటింటా చెత్త సేకరించే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. నిత్యం ఇంటింటా చెత్తను సేకరించి సంపద సృష్టి కేంద్రానికి తరలించాలన్నారు. చెత్త నుండి సంపదను సృష్టించడం ద్వారా గ్రామాలు స్వచ్ఛత సాధిస్తాయని అన్నారు.