నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PLD: బెల్లంకొండ మండల పరిధిలోని పలు గ్రామాలకు విద్యుత్ మరమ్మతుల కారణంగా శుక్రవారం కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు మండల విద్యుత్ శాఖ అధికారి పవన్ కుమార్ తెలిపారు. చిట్యాల, మాచయ్యపాలెం, కందిపాడు, చండ్రాజుపాలెం గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.