గ్రామపంచాయతీలో పరిపాలన గందరగోళం
కృష్ణా: మోపిదేవి(M) పెదప్రోలు గ్రామపంచాయతీలో పరిపాలన గందరగోళం నెలకొంది. ప్రస్తుత పంచాయతీ కార్యదర్శిని పక్కనపెట్టి, జూనియర్ అసిస్టెంట్, ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన మాజీ కార్యదర్శి అధికారం చెలాయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ సర్పంచ్ జోక్యం కూడా పెరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. కక్షసాధింపుల కారణంగా గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అంటున్నారు.