VIDEO: CMRF చెక్కులు అందజేేసిన ఎమ్మెల్యే

W.G: పేద ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారికి వైద్య ఖర్చులు భారంగా మారకూడదని రాష్ట్ర ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. బుధవారం మొగల్తూరులో CMRF చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందజేస్తుందన్నారు.