శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి స్వామి దర్శనం కోసం 8 గంటల సమయం పడుతుండగా.. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,838 మంది భక్తులు దర్శించుకోగా.. 31,006 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు.