భైరవకోన పూజారిపై దాడి
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం డీజీపేట గ్రామానికి చెందిన రామ్మూర్తిపై భైరవకోన దేవస్థానంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పూజారిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రామ్మూర్తికి తీవ్ర గాయాలు కావడంతో పామూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు