రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
PLD: పిడుగురాళ్ల సమీపంలోని రైల్వే వంతెనపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జానపాడుకు చెందిన హసనేరు అనే వ్యక్తి బైక్‌పై వస్తుండగా, వంతెనపై నియంత్రణ కోల్పోయి సిమెంట్ నిర్మాణాన్ని ఢీకొన్నాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.