రంజాన్‌కు పటిష్ట బందోబస్తు

రంజాన్‌కు పటిష్ట బందోబస్తు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ప్రార్థనా మందిరాలు, స్థలాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు. డ్రోన్తో, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ప్రత్యేక దృష్టిసారించి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు రంజాన్ సాఫీగా జరిగింది.