నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రయాణికుడు ఆటోలో తన సూట్‌కేస్‌ను మర్చిపోయి వెళ్లిపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించగా, ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీనివాస్ రావు వెంటనే స్పందించి ప్రయాణికుడిని తీసుకుని ఆటో స్టాండ్‌కు వెళ్లారు. అక్కడ విచారణలో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో సూట్‌కేస్ ఉందని గుర్తించి, నిజాయితీగా పోలీసులకు అప్పగించాడు.