కార్వాన్ ఎమ్మెల్యే భార్య ఏకగ్రీవం

కార్వాన్ ఎమ్మెల్యే భార్య ఏకగ్రీవం

మెదక్ జిల్లా బస్వాపూర్ గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. HYD కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ భార్య నజ్మా సుల్తానా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమెను ఎన్నికల అధికారులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ప్రకటించారు. గ్రామంలోని 8 వార్డుల సభ్యులూ పోటీ లేకుండానే ఎన్నుకోబడ్డారు. కాగా, ఎమ్మెల్యే మొహియుద్దీన్ స్వగ్రామం ఇదే కావడంతో నజ్మా ఇక్కడే నివాసముంటున్నారు.