శాసనమండలి రేపటికి వాయిదా
AP: శాసనమండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభలో వైసీపీ సభ్యుల నిరసనలు, ఆందోళనల మధ్య మండలి ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తూ.. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. దీంతో ఛైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.