కుప్పం బయలుదేరిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

కుప్పం బయలుదేరిన  ప్రభుత్వ ఉపాధ్యాయులు

NZB: జిల్లాకు చెందిన 41 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మంగళవారం కుప్పం బయలుదేరారు. డీఈఓ అశోక్ ఆధ్వర్యంలో వీరంతా అగస్త్య ఫౌండేషన్ నిర్వహించే 'మేక్ యువర్ ఓన్ ల్యాబ్' వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సైన్స్, మ్యాథ్స్ ప్రయోగాత్మక పద్ధతులపై శిక్షణ ఇస్తారు. ఈ బృందానికి డీఈఓ అశోక్ వీడ్కోలు పలికారు.