కలెక్టరేట్లో గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

AKP: అనకాపల్లి కలెక్టరేట్లో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. లచ్చన్న చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ రావు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, పూలమాలలువేసి నివాళులు అర్పించారు. లచ్చన్న బీసీల సంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. అలాగే మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్నారు.