రూ.344 కోట్లతో డ్రైయిన్ల పనులు పూర్తి: నిమ్మల

రూ.344 కోట్లతో డ్రైయిన్ల పనులు పూర్తి: నిమ్మల

AP: కూటమి పాలనలో ప్రాజెక్టుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు రూ.200 కోట్లు, ధవళేశ్వరం ప్రాజెక్టుకు రూ.150 కోట్లు కేటాయించామని తెలిపారు. తొలి ఏడాదిలోనే రూ.344 కోట్లు ఖర్చు చేసి ప్రధాన కాలువల డ్రైయిన్ల పనులు పూర్తి చేశామని చెప్పారు. 2027 జూలై కల్లా పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు.