కేతిరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
MBNR: బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ. డీ జానకి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ.. నిర్భయంగా ఓటు వేయాలన్నారు. పోలింగ్ ఏర్పాట్లను, సౌకర్యాలపై పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున ఎస్సై, లెనిన్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.