VIDEO: ధోని జెర్సీలతో అభిమానుల సందడి
MDCL: ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ SRH vs CSK పోరుకు రంగం సిద్ధమైంది. ఎక్కడ చూసినా ధోనీ జెర్సీలతో స్టేడియం పసుపుమయంగా మారింది. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్‌తో హైదరాబాద్ బలంగా ఉండగా, వరుస విజయాలతో చెన్నై మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటికే ప్రాక్టీస్ పూర్తి చేసిన ధోనీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎదురుచూస్తున్నారు.