అత్యాధునిక 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
PLD: చిరుమామిళ్లలో రూ.10 కోట్ల వ్యయంతో అత్యాధునిక 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రభుత్వం, దాత నడికట్టు రామిరెడ్డి భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు, రామిరెడ్డి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆయన గౌరవార్థం 'నడికట్టు రామిరెడ్డి ఆసుపత్రి'గా నామకరణం చేయగా, ఏడాదిలోపు దీనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించానట్లు తెలిపారు.