గాజువాకలో ఉచిత వైద్య శిబిరం

గాజువాకలో ఉచిత వైద్య శిబిరం

VSP: గాజువాక నియోజకవర్గం దుర్గవాణిపాలెం గౌరీపరమేశ్వరుల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మేరకు నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు150 మందికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు గంట్యాడ గురుమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ సేవలో పలువురు కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.