ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట - రావిపాడు రోడ్డులో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో షేక్ సిలార్స అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే బైక్ అదుపుతప్పడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.