VIDEO: మన్ కీ బాత్‌లో మోదీ నోట.. ముదిగుంట మాట

VIDEO: మన్ కీ బాత్‌లో మోదీ నోట.. ముదిగుంట మాట

MNCL: జైపూర్ మండలం ముదిగుంట గ్రామస్థులు జలసంరక్షణ కోసం చేపట్టిన ఇంటింట ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం 132వ 'మన్ కీ బాత్ కార్యక్రమం'లో భాగంగా ఆ పల్లెవాసులు చేపట్టిన జల సంరక్షణ చర్యలను ప్రధాని అభినందించారు. గ్రామంలో 1571 మంది జనాభా ఉండగా, 443 కుటుంబాల్లో 353 కుటుంబాలు పూర్తి స్ధాయిలో ఇంకుడు గుంతల నిర్మాణం జల సంరక్షణకు దోహదం చేశాయి.