రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NLG: గుండ్లపల్లి(డిండి) మండలం ఖానాపూర్‌లో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలన్నారు.