మేదరమెట్ల మార్కెట్ యార్డుకు మహర్దశ

మేదరమెట్ల మార్కెట్ యార్డుకు మహర్దశ

బాపట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని మార్కెట్ యార్డుకు మహర్దశ పట్టింది. సోమవారం యార్డు నందు అధికారులు పిచ్చి చెట్లు తొలగింపు పనులు చేపట్టారు. ఈ పనులను ఛైర్మన్ పర్యవేక్షించారు. గతంలో యార్డు లోపల చిల్ల చెట్లతో పాటు పిచ్చి చెట్లు దట్టంగా పెరగటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. దీంతో ఈ తొలగింపుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.