VIDEO: బియ్యపు గింజపై త్రివర్ణ పతాకం

VIDEO: బియ్యపు గింజపై త్రివర్ణ పతాకం

వరంగల్ కాశిబుగ్గకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ లింగమూర్తి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు. కేవలం 33సెకన్ల సమయంలో, ఆయన బియ్యపు గింజపై త్రివర్ణ పతాకాన్ని అశోకచక్రంతో సహా మూడు రంగులలో చిత్రీకరించారు. ఇంతకుముందు శనగపప్పుపై వినాయకుని ప్రతిమను రూపొందిచగా, ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన సూక్ష్మ కళా నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు.