నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

సంగారెడ్డి: పటాన్‌చెరు మండల పరిధిలోని లకడారం గ్రామంలో  3.76 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరెంటు సమస్య వల్ల రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.