'హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'
NLR: సీపీఎం కార్యకర్త పెంచలయ్య హత్య బాధాకరమని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రౌడీలు, గంజాయి బ్యాచ్‌ను భయపట్టేలా పోలీసుల చర్యలు ఉండాలని సూచించారు. ఇప్పటికే రౌడీలపై నెల్లూరు పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారని, వారు తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.