VIDEO: షార్ట్‌ సర్క్యూట్.. పత్తి దగ్ధం

VIDEO: షార్ట్‌ సర్క్యూట్.. పత్తి దగ్ధం

SRCL: వేములవాడలోని భగవంతరావు నగర్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెరుగు జలంధర్ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న పత్తి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.