గిద్దలూరులో దంచి కొట్టిన వర్షం

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో శనివారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మాత్రం వర్షపాతం ఓ మోస్తరుగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.