అలుగులో కొట్టుకుపోయిన వృద్ధ దంపతులు

అలుగులో కొట్టుకుపోయిన వృద్ధ దంపతులు

MBNR: జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని కిష్టారం చెరువు అలుగు వరద నీటిలో కొట్టుకుపోయి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు తానం రాములమ్మ, బాలయ్య గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అలుగు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. గురువారం సాయంత్రం భారీ వర్షం కురియడంతో అలుగు పెద్దగా పారుతోంది.