VIDEO: జల్లపల్లి వద్ద PABR కాల్వ తెగిపోవడంతో రైతులు ఆందోళన
ATP: కూడేరు మండలం జల్లపల్లి వద్ద PABR కాల్వ ఆదివారం ఉదయం తెగిపోవడంతో పంట పొలాలు నీటమునిగాయి. ఆకస్మికంగా నీరు పొలాల్లోకి చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వ గట్టులు బలహీనపడ్డాయని స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను రైతులు కోరుతున్నారు.